KCR: కూరగాయల వ్యాపారులు, ఆర్టీసీ సిబ్బందికి సంబంధించి కేసీఆర్ కీలక ఆదేశాలు

KCR key orders on vaccination to Corona super spreaders
  • కరోనా పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తున్న సీఎం
  • సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సిన్లు ఇవ్వాలని ఆదేశం
  • కరోనా కట్టడికి జిల్లా కలెక్టర్లు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సూచన
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చర్యలను వేగవంతం చేశారు. కరోనాకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులను సందర్శిస్తూ, స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కరోనా కట్డడికి  రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను పోషించాలని ఆయన పిలుపునిస్తున్నారు. మరోవైపు, కరోనా వ్యాప్తికి సంబంధించి సూపర్ స్ప్రెడర్స్ గా ఉన్న వారికి తక్షణమే వ్యాక్సిన్ అందించాలని అధికారులకు సూచించారు.

సూపర్ స్ప్రెడర్స్ గా ఉన్న కూరగాయల వ్యాపారులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, డెలివరీ బోయ్స్, సేల్స్ మెన్లను గుర్తించి... వారందరికీ వెంటనే టీకాలు వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను కేసీఆర్ ఆదేశించారు. వీరికి వ్యాక్సినేషన్ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. అన్ని జిల్లాలకు వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు. కరోనా కట్టడికి జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు.
KCR
TRS
Corona Virus
Super Spreaders

More Telugu News