Pawan Kalyan: బీఏ రాజు మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan condolences to BA Raju demise
షార్ట్స్‌లో చూడండి
నిర్మాత, పీఆర్వో బీఏ రాజు గతరాత్రి గుండెపోటుతో మరణించడం పట్ల అగ్రకథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. బీఏ రాజు హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడించారు. బీఏ రాజు జర్నలిస్టుగా, పీఆర్వోగా తెలుగు సినీరంగంలో చిరపరిచితులైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

"బీఏ రాజుతో చెన్నైలో ఉన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. ఆయన సినిమా అంటే ఎంతో తపన కలిగిన జర్నలిస్టు. మా అన్నయ్య చిరంజీవి నటించిన పలు చిత్రాలకు పీఆర్వోగా వ్యవహరించారు. 'సూపర్ హిట్' సినీ పత్రిక సంపాదకులుగానే కాకుండా నిర్మాతగానూ రాణించారు" అంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. బీఎ రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
BA Raju
Death
PRO
Journalist
Producer
Tollywood

More Telugu News