Corona Vaccine: రాష్ట్రాల వద్ద ఇప్పటికీ 1.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉన్నాయి: కేంద్ర ప్రభుత్వం

Over one and half Crore Corona Vaccine Doses Still Available With States says Centre
  • దేశంలో కరోనా వ్యాక్సిన్ కు నెలకొన్న కొరత
  • కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న రాష్ట్రాలు
  • మరో 3 రోజుల్లో 2.67 లక్షల డోసులు సరఫరా  
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ డోసులకు విపరీతమైన కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమకు అవసరమైనంత మేరకు వ్యాక్సిన్ సరఫరా చేయడం లేదని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికీ రాష్ట్రాల వద్ద 1.6 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 21 కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 2,67,110 వ్యాక్సిన్ డోసులు సరఫరా ప్రక్రియలో ఉన్నాయని... మూడు రోజుల్లో రాష్ట్రాలు, యూటీలు వాటిని అందుకుంటాయని తెలిపింది.
Corona Vaccine
Union
States

More Telugu News