Southwest monsoons: వాతావరణశాఖ చల్లని కబురు.. వచ్చేసిన ‘నైరుతి’

Southwest Monsoon Arrives Over Andaman And Nicobar Islands
  • అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించిన నైరుతి
  • ఈ నెల 31న కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు
  • వచ్చే నెల రెండో వారంలో తెలంగాణలోకి
వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. అండమాన్, నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు తెలిపింది. త్వరలోనే ఇవి కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాలు, నికోబార్ దీవులు, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు నిన్ననే ప్రవేశించినట్టు భారత వాతావరణ పరిశోధన శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నెల 31న  ఇవి కేరళను తాకనున్నాయని, జూన్ రెండో వారంలో రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని ఐఎండీ గతవారమే తెలిపింది.
Southwest monsoons
Kerala
IMD

More Telugu News