Dipcovan: డిప్కోవాన్... కరోనా టెస్టింగ్ కిట్ రూపొందించిన డీఆర్డీవో

  • ఇటీవల 2-డీజీ ఔషధాన్ని రూపొందించిన డీఆర్డీఓ
  • తాజాగా మరో ఆవిష్కరణ
  • యాంటీబాడీలను గుర్తించే కిట్ కు రూపకల్పన
  • అన్ని అనుమతులు దక్కించుకున్న డిప్కోవాన్
DRDO brings corona testing kit Dipcovan

దేశ రక్షణ పరికరాల అభివృద్ధి, రూపకల్పన బాధ్యతలు పర్యవేక్షించే డీఆర్డీఓ ఇటీవలే 2-డీజీ పేరిట కరోనా ఔషధాన్ని తయారుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా డిప్కోవాన్ పేరిట కరోనా టెస్టింగ్ కిట్ ను రూపొందించింది. డీఆర్డీఓకు చెందిన డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అల్లైడ్ సైన్సెస్ (డిపాస్), ఢిల్లీకి చెందిన వాన్ గార్డ్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కొత్త కిట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించాయి. దీని ద్వారా శరీరంలో యాంటీబాడీలను గుర్తించవచ్చు.

డిప్కోవాన్ కొవిడ్ టెస్టింగ్ కిట్ ధర కేవలం 75 రూపాయలే. ఇది జూన్ మొదటివారంలో మార్కెట్లోకి రానుంది. ఓ వ్యక్తి గతంలో కరోనా బారినపడ్డాడా? అనే విషయం ఈ కిట్ తో వెల్లడవుతుంది. కేవలం 75 నిమిషాల్లోనే పరీక్ష ఫలితం తెలిసిపోతుంది. డిప్కోవాన్ కిట్ కు ఏప్రిల్ లోనే ఐసీఎంఆర్ ఆమోదం లభించింది. మే నెలలో డీసీజీఐ, సీడీఎస్ సీఓ, కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. దాంతో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభించారు.

More Telugu News