Airindia: ఎయిరిండియాలో అతిపెద్ద డేటా హ్యాక్ వెల్లడి

Airindia passengers data hacked
  • ఎయిరిండియా ప్రయాణికుల సమాచారం చోరీ
  • క్రెడిట్ కార్డు, పాస్ పోర్టు డేటా హ్యాకర్ల పరం
  • 45 లక్షల మంది సమాచారం చోరీకి గురైందన్న ఎయిరిండియా
  • తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్న విమానయాన సంస్థ
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో అతి భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగినట్టు వెల్లడైంది. ఎయిరిండియా ప్రయాణికులకు సంబంధించి క్రెడిట్ కార్డు డేటా, పాస్ పోర్టు డేటా లీకైనట్టు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురైనట్టు ఎయిరిండియా వెల్లడించింది.

వీరిలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. 2011 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ డేటా హ్యాకింగ్ జరిగినట్టు నిర్ధారించారు. హ్యాకింగ్ జరిగిన విషయం గుర్తించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఎయిరిండియా స్పష్టం చేసింది.
Airindia
Data
Hack
Passengers
Credit Card
Passport

More Telugu News