COVAXIN: గుజరాత్ లోనూ కొవాగ్జిన్ ఉత్పత్తి...  భారత్ బయోటెక్ ప్రకటన

  • ప్రస్తుతం హైదరాబాదు, బెంగళూరులో ఉత్పత్తి
  • వ్యాక్సిన్ ఉత్పత్తి మరింత పెంచేందుకు నిర్ణయం
  • నాలుగో త్రైమాసికం నుంచి అంక్లేశ్వర్ లో ఉత్పత్తి
  • వంద కోట్ల డోసుల లక్ష్యంపై కన్నేసిన భారత్ బయోటెక్
 Bharat Biotech announces Covaxine production line in Gujarat

దేశంలో కరోనా వ్యాక్సిన్ డిమాండ్ ను అందుకునేందుకు కొవాగ్జిన్ సృష్టికర్త భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం కొవాగ్జిన్ ను హైదరాబాదు, బెంగళూరు నగరాల్లో మాత్రమే ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ ఇకపై గుజరాత్ లోనూ ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతోంది. అంక్లేశ్వర్ లోని చిరోన్ బెహ్రింగ్ వ్యాక్సిన్ కేంద్రంలోనూ కొవాగ్జిన్ డోసులు ఉత్పత్తి చేయనున్నట్టు భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది.

అంక్లేశ్వర్ లోని వ్యాక్సిన్ కేంద్రం నుంచి ఈ ఏడాది నాలుగో త్రైమాసికం నాటికి ఉత్పత్తి ప్రారంభం కానుంది. కొవాగ్జిన్ టీకా ప్రత్యేకత కారణంగా దీన్ని ఉత్పత్తి చేయడానికి బీఎస్ఎల్-3 ప్రమాణాలు ఉన్న ల్యాబ్ లు అవసరం అవుతాయి. కాగా, తమ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాల సంఖ్య మూడుకు పెరిగిన నేపథ్యంలో, ఏడాదికి వంద కోట్ల డోసులు ఉత్పత్తి సాధ్యమేనని భారత్ బయోటెక్ భావిస్తోంది.

More Telugu News