Roja: ఆరోగ్య సమస్యలతో సభకు రాలేకపోయినందుకు చాలా బాధగా ఉంది: రోజా

Roja video message on budget allocations
  • ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న రోజా
  • అసెంబ్లీ సమావేశాలకు దూరం
  • ప్రత్యేకంగా వీడియో విడుదల
  • సీఎం జగన్ పై ప్రశంసల జల్లు
  • జెండర్ బడ్జెట్ తెచ్చిన మొదటి సీఎం అంటూ కితాబు
ఇటీవలే చెన్నైలో శస్త్రచికిత్స చేయించుకున్న నగరి ఎమ్మెల్యే రోజా నేటి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఆరోగ్య సమస్యలతో సభకు రాలేకపోయినందుకు ఎంతో బాధగా ఉందని రోజా ఓ వీడియోలో వెల్లడించారు. ఈ దేశంలోనే మహిళా పక్షపాతి సీఎంగా జగన్ మరోసారి రికార్డు సృష్టించారని తెలిపారు. దేశంలో మరే సీఎం చేయని విధంగా మహిళల కోసం ప్రత్యేకంగా జెండర్ బడ్జెట్ కేటాయించిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని కితాబునిచ్చారు.

కేవలం మహిళల కోసమే రూ.47,288 కోట్లు కేటాయించిన సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. మహిళా ప్రధానమంత్రి, మహిళా ముఖ్యమంత్రులెవరూ చేయనిది, మహిళల కోసం జగన్ చేసి చూపించారని కీర్తించారు. 30 ఏళ్ల పాటు ప్రజల తలరాతలు మార్చగల 'టార్చ్ బేరర్' సీఎం జగన్ అని రోజా అభివర్ణించారు.
Roja
Budget
Jagan
Gender Based
YSRCP
Andhra Pradesh
India

More Telugu News