Anil Ravipudi: మహేశ్ మాటలు మందులా పని చేశాయి: అనిల్ రావిపూడి

Anil Ravipudi remembers Mahesh Babu words in his Corona time
  • కరోనా బారిన పడినప్పుడు అలా చేశాను
  • వెంకీ .. వరుణ్ ధైర్యం చెప్పేవారు
  • మహేశ్ హాయిగా నవ్వించేవారు  
యువతరం దర్శకులలో అనిల్ రావిపూడికి మంచి క్రేజ్ ఉంది. వరుస విజయాలతో ఆయన దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన 'ఎఫ్ 3' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే ఆయన కరోనా బారిన పడ్డాడు ... ఆ తరువాత కోలుకున్నాడు.

ఆ విషయాలను గురించి ఆయన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. "నాకు కరోనా సోకిందని తెలియగానే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయాను. కరోనా వచ్చిందని దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా, పుస్తకాలు చదువుతూ .. స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తూ మనసును మళ్లించేవాడిని.

ఆ సమయంలో నాకు వెంకటేశ్ గారు .. వరుణ్ తేజ్ కాల్ చేసేవారు. వెంకటేశ్ గారు జాగ్రత్తలు చెప్పేవారు. ఇక వరుణ్ తేజ్ కంగారు పడవలసిన పని లేదని అంటూ ధైర్యం చెప్పేవాడు. ఇక మహేశ్ బాబు కూడా రెండు మూడు రోజులకు ఒకసారి తప్పకుండా కాల్ చేసేవారు. ఎలా ఉందని అడిగిన తరువాత .. తన సరదా మాటలతో అదే పనిగా నవ్వించేవారు. దాంతో నేను మానసిక పరమైన ఒత్తిడిలో నుంచి బయటికి వచ్చేవాడిని. నిజం చెప్పాలంటే నేను కరోనా బారిన పడినప్పుడు, మహేశ్ మాటలు నాపై మందులా పనిచేశాయి" అని చెప్పుకొచ్చాడు.
Anil Ravipudi
Mahesh Babu
Venkatesh
Varun Tej

More Telugu News