Bandi Sanjay: రాకరాక కేసీఆర్ బయటికి వచ్చేసరికి అందరికీ అదొక వింతలా ఉంది: బండి సంజయ్

Bandi Sanjay satires in KCR Gandhi Hospital visit
  • నిన్న గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేసీఆర్
  • విమర్శనాస్త్రాలు సంధించిన బండి సంజయ్
  • ఏడేళ్ల తర్వాత కేసీఆర్ బయటికి వచ్చాడని వెల్లడి
  • అదొక పబ్లిసిటీ స్టంట్ అని విమర్శలు
  • ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న గాంధీ ఆసుపత్రిని సందర్శించిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ గాంధీ ఆసుపత్రి సందర్శన ఒక పబ్లిసిటీ స్టంట్ అని అభివర్ణించారు. రాకరాక సీఎం కేసీఆర్ బయటికి వచ్చేసరికి అందరికీ అదొక వింతలా ఉందని పేర్కొన్నారు. ఏడేళ్ల పాలనలో తొలిసారి బయటికి వచ్చి అదేదో గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారని, ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు.

"గతంలో సీఎంగా చేసిన వారు వారానికోసారైనా ప్రజల సమస్యలు తెలుసుకునేవారు. ఆ పద్ధతికి దూరంగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. అలాంటి సీఎం ఏడేళ్ల తర్వాత బయటికి వచ్చేసరికి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గంట పాటు పర్యటించాడు... ఇక ఏడేళ్లపాటు పబ్లిసిటీ చేసుకోండి. మళ్లీ ఫాంహౌస్ కు వెళ్లాడంటే మూడేళ్లు ఇక బయటికి రాడు. ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా బయటికి రాని కేసీఆర్ నిన్న బయటికొచ్చాడు... విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటున్నారు" అని విమర్శించారు.
Bandi Sanjay
KCR
Gandhi Hospital
Corona Pandemic
Telangana

More Telugu News