రాకరాక కేసీఆర్ బయటికి వచ్చేసరికి అందరికీ అదొక వింతలా ఉంది: బండి సంజయ్
- నిన్న గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేసీఆర్
- విమర్శనాస్త్రాలు సంధించిన బండి సంజయ్
- ఏడేళ్ల తర్వాత కేసీఆర్ బయటికి వచ్చాడని వెల్లడి
- అదొక పబ్లిసిటీ స్టంట్ అని విమర్శలు
- ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వ్యాఖ్యలు
"గతంలో సీఎంగా చేసిన వారు వారానికోసారైనా ప్రజల సమస్యలు తెలుసుకునేవారు. ఆ పద్ధతికి దూరంగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. అలాంటి సీఎం ఏడేళ్ల తర్వాత బయటికి వచ్చేసరికి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గంట పాటు పర్యటించాడు... ఇక ఏడేళ్లపాటు పబ్లిసిటీ చేసుకోండి. మళ్లీ ఫాంహౌస్ కు వెళ్లాడంటే మూడేళ్లు ఇక బయటికి రాడు. ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా బయటికి రాని కేసీఆర్ నిన్న బయటికొచ్చాడు... విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటున్నారు" అని విమర్శించారు.