Jr NTR: నిండు మనసుతో నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు: ఎన్టీఆర్

NTR thanked each and every one who wished him on birthday
  • నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు
  • వెల్లువెత్తిన శుభాకాంక్షలు
  • సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి
  • వినమ్రంగా స్పందించిన ఎన్టీఆర్
  • గొప్పగా భావిస్తున్నానని వెల్లడి
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ మేనియా కనిపించింది.

దీనిపై ఎన్టీఆర్ స్పందించారు. నిండు మనసుతో శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, చిత్ర పరిశ్రమ సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఇంతటి అభిమానం పట్ల గొప్పగా భావిస్తున్నానని తెలిపారు.

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ ఇటీవలే కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్న ఆయన క్రమంగా కోలుకుంటున్నారు.
Jr NTR
Birthday
Wishes
Fans
Tollywood
RRR
Corona

More Telugu News