KIA Motors: కొవిడ్ చర్యల కోసం ఏపీ సర్కారుకు రూ.5 కోట్ల విరాళం అందించిన కియా మోటార్స్

KIA Motors donates huge amount to AP govt
  • ఏపీలో కరోనా విజృంభణ
  • సీఎం జగన్ ను కలిసిన కియా ఎండీ
  • నెఫ్ట్ ద్వారా నగదు బదిలీ
  • విరాళం తాలూకు పత్రాలు సీఎం జగన్ కు అందజేత

ఏపీలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కట్టడి, సహాయకచర్యలకు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏపీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ)కి రూ.5 కోట్ల భారీ విరాళం అందించింది. కియా ఇండియా విభాగం ఎండీ, సీఈఓ కుక్ హ్యున్ షిమ్ సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళం తాలూకు పత్రాలను అందజేశారు. నెఫ్ట్ ద్వారా విరాళం మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా కియా ఎండీతో పాటు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News