రాజస్థాన్‌పై బ్లాక్ ఫంగస్ పంజా.. అంటువ్యాధిగా ప్రకటించిన ప్రభుత్వం
- రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం కింద గుర్తింపు
- రాజస్థాన్‌లో వందకుపైగా బ్లాక్ ఫంగస్ కేసులు
- జైపూర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్‌ను కూడా అంటువ్యాధిగా గుర్తిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం-2020 కింద దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా తెలిపారు. బ్లాక్ ఫంగస్, కరోనాలకు సమగ్రమైన, సమన్వయంతో కూడిన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.