Petrol pumps: లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులను మినహాయించిన తెలంగాణ సర్కారు

Telangana govt gives exemption to petrol pumps in rural and urban areas
  • తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్
  • కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
  • వ్యవసాయ అవసరాల నేపథ్యంలో పెట్రోల్ బంకులకు ఓకే
  • పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్నివేళలా పెట్రోల్ బంకులు
తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, వ్యవసాయ, ధాన్యం రవాణా వాహనాల ఇంధన అవసరాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెట్రోల్ బంకులను లాక్ డౌన్ నుంచి మినహాయిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే నేషనల్ హైవేల వెంబడి ఉండే పెట్రోల్ బంకులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉండగా... తాజా ఉత్తర్వులతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పెట్రోల్ బంకులు కూడా అన్ని వేళలా పని చేయనున్నాయి.
Petrol pumps
Exemption
Lockdown
Telangana

More Telugu News