Narendra Modi: కరోనా ఎఫెక్ట్.. పడిపోయిన ప్రధాని మోదీ రేటింగ్!

PM Modis approval rating falls says US firm
  • ప్రపంచ నేతల పాప్యులారిటీని ట్రాక్ చేసే మార్నింగ్ కన్సల్ట్స్
  • 2019 తర్వాత  దారుణంగా మసకబారిన మోదీ ప్రతిష్ఠ
  • కరోనా కేసులు, మరణాలతో తగ్గిన పాప్యులారిటీ
భారత ప్రధాని నరేంద్రమోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాప్యులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా సహా ప్రపంచ మీడియాలో నిన్నమొన్నటి వరకు ఆయన గ్రేట్ లీడర్‌గా వెలుగొందారు. అయితే, దేశంపై విరుచుకుపడిన కరోనా సెకండ్ వేవ్ మోదీ పేరుప్రతిష్ఠలను దారుణంగా దిగజార్చింది.

గత మూడు దశాబ్దాల్లో ఏ భారత నాయకుడికి సాధ్యం కాని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న మోదీ ప్రతిష్ఠ కరోనా దెబ్బకు అమాంతం మసకబారింది. అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్స్ చేసిన సర్వేలో మోదీ రేటింగ్ అత్యంత కనిష్ఠానికి పడిపోయినట్టు తేలింది.

కరోనా వైరస్ కేసుల సంఖ్య 2.5 కోట్లు దాటడం ఆయన ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ విరుచుకుపడడానికి మోదీయే కారణమంటూ ఇటీవల గ్లోబల్ మీడియా కూడా దుమ్మెత్తి పోసింది.

మార్నింగ్స్ కన్సల్ట్స్ అనేది ప్రపంచస్థాయి నేతల పాప్యులారిటీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ నివేదికలు ఇస్తుంటుంది. తాజాగా అది వెల్లడించిన నివేదికలో ఈ వారం మోదీ ఓవరాల్ రేటింగ్ 63 శాతానికి పడిపోయింది. ఆగస్టు 2019లో తాము మోదీ పాప్యులారిటీని ట్రాక్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయనకు వచ్చిన అత్యంత కనిష్ఠ రేటింగ్ ఇదేనని ఆ సంస్థ పేర్కొంది.

దేశంలోని ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ లేక కొవిడ్ రోగులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతుండడం, ఆసుపత్రుల్లో బెడ్ల కోసం వేసి చూసి పార్కింగ్ ప్రదేశాల్లోనే చనిపోతుండడం, శ్మశాన వాటికల్లో అంత్యక్రియలకు క్యూలు.. వంటివన్నీ సోషల్ మీడియాలో మోదీపై వ్యతిరేకతకు కారణమయ్యాయి.
Narendra Modi
Corona Virus
Raiting

More Telugu News