కాసేపట్లో గాంధీ ఆసుపత్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్
- ప్రస్తుతం ఆరోగ్యశాఖ కూడా కేసీఆర్ వద్దే
- గాంధీ ఆసుపత్రిని పరిశీలించనున్న కేసీఆర్
- అక్కడే గాంధీ వైద్యులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం
ప్రస్తుతం రాష్ట్ర ఆరోగ్యశాఖ కూడా కేసీఆర్ వద్దే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితిపై ఆయన సమీక్షలు కూడా నిర్వహిస్తూ సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గాంధీ ఆసుపత్రిని స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం గాంధీ ఆసుపత్రి వైద్యులతో సమీక్ష నిర్వహించి, కరోనా పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. ఆక్సిజన్ అందుబాటు, మందుల సరఫరా తదితర అంశాలపై చర్చించనున్నారు.