Jaquelin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Jaquelin in Hollywood movie
  • హాలీవుడ్ సినిమాలో బాలీవుడ్ భామ 
  • ప్రభాస్ సినిమా మరింత ముందుకు!
  • 'పుష్ప' రెండో భాగానికి కొత్త టైటిల్  
*  ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు తాజాగా హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 'విమెన్స్ స్టోరీస్' పేరిట రూపొందే ఈ హాలీవుడ్ సినిమాలో జాక్వెలిన్ పోలీస్ అధికారిగా నటిస్తుందట.
*  కొవిడ్ కారణంగా షూటింగులు బంద్ కావడంతో ఆయా సినిమాల నిర్మాణంలో జాప్యం కలుగుతోంది. ఇదే కారణంతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ నిర్మించే సినిమా షూటింగ్ కూడా మరింత ముందుకు వెళుతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న 'ఆదిపురుష్', 'సలార్' సినిమాల షూటింగులు ఆలస్యమవుతుండడంతో నాగ్ అశ్విన్ చిత్రాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది.
*  సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి విదితమే. దీంతో రెండో భాగానికి 'పుష్ప 2' అని కాకుండా కొత్త టైటిల్ పెట్టాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. త్వరలోనే దీని టైటిల్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.
Jaquelin
Pawan Kalyan
Prabhas
Allu Arjun

More Telugu News