చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో యోగా కార్యక్రమాలకు ప్రోత్సాహం

18-05-2021 Tue 18:12
  • ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు
  • రామ్ చరణ్ ఫ్యాన్స్ సామాజిక కార్యాచరణ
  • టాటా గ్రూప్, కేంద్ర ఆయుష్ విభాగం మద్దతు
  • ప్రచార చిత్రాలు, టీషర్టులు ఆవిష్కరణ
Chiranjeevi birthday special initiative

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ యువశక్తి అభిమాన సంఘం, కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ, టాటా గ్రూప్ ఓ సామాజిక ప్రయోజన కార్యాచరణకు ఉపక్రమించాయి. '

అందరికీ యోగా' పేరుతో ఆన్ లైన్ యోగా శిక్షణ కార్యక్రమాలకు ప్రోత్సాహం అందంచాలని నిర్ణయించాయి. ఇప్పటికే టాటా వారి సెర్ట్ యోగా సంస్థ చేపడుతున్న యోగా కార్యాచరణకు మరింత ప్రచారం కల్పించాలని రామ్ చరణ్ యువశక్తి సంస్థ, ఆయుష్ భావిస్తున్నాయి.

ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రచార పోస్టర్లను, ప్రత్యేక టీషర్టులను ఆవిష్కరించారు. ఈ కార్యాచరణలో పాలుపంచుకుని యోగా శిక్షణ పొందాలనుకునేవారు సెర్ట్ యోగా (https://www.certyoga.com) వెబ్ సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.