Kruthi Shettty: కొత్త ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి!

Kruthi Shetty  gave a clarity on her new movies
  • 'ఉప్పెన'తో లభించిన భారీ సక్సెస్
  • మూడు ప్రాజెక్టులతో బిజీ
  • కొత్త ప్రాజెక్టులపై సైన్ చేయలేదన్న కృతి  
ఈ మధ్య కాలంలో యువ ప్రేక్షకులను ఎక్కువగా ప్రభావితం చేసిన కథానాయికగా కృతి శెట్టి కనిపిస్తుంది. 'ఉప్పెన' సినిమాతో ఈ బ్యూటీ కుర్రాళ్ల మనసులను దోచేసింది. భారీ విజయంతో పాటు .. రికార్డు స్థాయి వసూళ్లకు కారణమైంది. దాంతో యంగ్ హీరోలంతా కూడా ఈ అమ్మాయి తమ సినిమాకి ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ఉత్సాహం చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సుందరికి తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయనే టాక్ వచ్చింది. అక్కడ కూడా బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా కృతి శెట్టి మాట్లాడుతూ, ప్రస్తుతం తన చేతిలో ఉన్నవి మూడు సినిమాలు మాత్రమేనని చెప్పింది. నాని హీరోగా 'శ్యామ్ సింగ రాయ్'తో పాటు సుధీర్ బాబు .. రామ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నానని స్పష్టం చేసింది.

ఇక తమిళంలో తాను ఏ సినిమాలు చేయడం లేదనీ, ఒకవేళ ఒప్పుకుంటే ఆ విషయాన్ని తాను తెలియజేస్తానని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా ఈ మూడు ప్రాజెక్టులపైనే ఉందనీ, అవి పూర్తయిన తరువాతనే వేరే ప్రాజెక్టులను గురించిన ఆలోచన చేస్తానని అంది. మరి ఈ మూడు సినిమాల తరువాత కృతి ఏయే ప్రాజెక్టులలో కుదురుకుంటుందో చూడాలి.
Kruthi Shettty
Nani
Sudheer Babu
Ram

More Telugu News