ఏపీలో కొనసాగుతున్న కొవిడ్ కల్లోలం

18-05-2021 Tue 17:49
  • గత 24 గంటల్లో 91,253 కరోనా పరీక్షలు
  • 21,320 మందికి పాజిటివ్
  • తూర్పు గోదావరిలో 2,923 కేసులు
  • రాష్ట్రంలో నిన్న 99 మంది మృతి
  • 21,274 మందికి కరోనా నయం
Covid surge continues in Andhra Pradesh

ఏపీలోని అన్ని జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 91,253 కరోనా పరీక్షలు నిర్వహించగా 21,320 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 2,923 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 2,804 కేసులు, చిత్తూరు జిల్లాలో 2,630 కేసులు, విశాఖ జిల్లాలో 2,368 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 21,274 మంది కోలుకోగా, 99 మంది మృత్యువాతపడ్డారు. చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున కరోనాతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మొత్తం మరణాల సంఖ్య 9,580కి పెరిగింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 14,75,372 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 12,54,291 మంది కోలుకున్నారు. ఇంకా 2,11,501 మంది చికిత్స పొందుతున్నారు.