Vijayasai Reddy: మోదీ ప్రశంసిస్తుంటే.. పచ్చ పార్టీ నేతలు గొడవ చేస్తున్నారు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy fires on Chandrababu
  • ఎంపీని హింసించారని చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు
  • అబద్ధాల పోటీలో వారు ఫస్ట్ ప్రైజ్ కు ఎంపికైనట్టే
  • విద్యా సంస్థలు, ఆసుపత్రులను బాబు భ్రష్టు పట్టించారు
కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాని మోదీతో పాటు, కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా ప్రశంసిస్తున్నారని... అయినప్పటికీ, పచ్చ పార్టీ పెద్దలకు అరెస్ట్ పై గొడవ చేయడం తప్ప, మరేమీ పట్టడం లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రజల పట్ల బాధ్యత లేని మీకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. గత రెండేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికలో ప్రజలు మీకు వాత పెట్టారని... అయినప్పటికీ మీకు బుద్ధి రాలేదని అన్నారు.

సీఐడీ కస్టడీలో ఉన్న ఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా అసత్యపు ప్రచారం చేశారని... ఈ ఏడాది ప్రపంచ అబద్ధాల పోటీలో వారు ఫస్ట్ ప్రైజ్ కు ఎంపికైనట్టేనని ఎద్దేవా చేశారు. కొన్నేళ్లుగా ఈ అవార్డు చంద్రబాబు, పచ్చ పార్టీ ప్రముఖులకే దక్కుతోందని అన్నారు. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వ్యవస్థలకు విశ్వసనీయత లేకుండా చంద్రబాబు భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఒక్కో ఆసుపత్రిని పచ్చ పార్టీ బ్రాంచి ఆఫీసు స్థాయికి దిగజార్చారని అన్నారు. ఓ ఆసుపత్రిలో 10 మంది కరోనా రోగులు ఆహుతైపోతే ఆ ఆసుపత్రిని వెనకేసుకొచ్చావని అన్నారు.

ఏనాడూ ప్రజల గురించి ఆలోచించని మీరు... ఉస్కో అంటే ఎగబడే వ్యక్తిని కాపాడేందుకు ఇంతగా తెగబడటమేంటని విజయసాయి ప్రశ్నించారు. కేంద్రం నుంచి తగినంత ఆక్సిజన్ సరఫరా లేక రోగులు యాతన పడుతుంటే ఒక్క లేఖ అయినా రాశావా? అని ప్రశ్నించారు.
Vijayasai Reddy
Narendra Modi
YSRCP
BJP
Chandrababu
Telugudesam

More Telugu News