తమిళనాట సీఎం సహాయనిధికి రూ.10 కోట్ల భారీ విరాళం అందించిన సన్ నెట్వర్క్ అధినేత

17-05-2021 Mon 16:14
  • తమిళనాడులో కరోనా స్వైరవిహారం
  • విరాళాలు ఇవ్వాలంటూ పిలుపునిచ్చిన సీఎం స్టాలిన్
  • ముందుకొచ్చిన సన్ నెట్వర్క్ యాజమాన్యం
  • సీఎంకు చెక్కు అందించిన కళానిధి, కావేరి దంపతులు
 Sun network donates ten crores to Tamilnadu CM Relief Fund

దేశంలోని అగ్రగామి టెలివిజన్ నెట్వర్క్ లలో ఒకటైన సన్ నెట్వర్క్ దాతృత్వంలోనూ భారీగా స్పందించింది. కరోనాతో విలవిల్లాడుతున్న తమిళనాడును ఆదుకునేందుకు పెద్ద మనసుతో ముందుకువచ్చింది. కొవిడ్ బారి నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలంటూ సీఎం స్టాలిన్ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం సహాయనిధికి రూ.10 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. సన్ నెట్వర్క్ చైర్మన్ కళానిధి మారన్, ఆయన అర్ధాంగి కావేరి ఈ మధ్యాహ్నం సీఎం స్టాలిన్ దంపతులను కలిసి తమ విరాళం తాలూకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్.... కళానిధి, కావేరి దంపతులను అభినందించారు. రాష్ట్రం పట్ల వారి స్పందనకు ధన్యవాదాలు తెలిపారు.