Banks: మహమ్మారికి 1,200 మంది బ్యాంకు ఉద్యోగుల బలి

  • వెల్లడించిన బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు
  • బ్యాంక్ ఉద్యోగులూ ఫ్రంట్ లైన్ వర్కర్లేనని కామెంట్
  • కేసులు, మరణాలు మరింత ఎక్కువుంటాయని వెల్లడి
Banks Have Lost Over 1000 Employees To Covid Many More Infected Report

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటిదాకా వెయ్యి మందికిపైగా బ్యాంక్ ఉద్యోగులు మరణించారని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్. నాగరాజన్ వెల్లడించారు. బ్యాంక్ ఉద్యోగులూ ఫ్రంట్ లైన్ వర్కర్లేనని, వైరస్ వారినీ కబళిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది దాని బారిన పడ్డారని చెప్పారు.

మహమ్మారి ధాటికి ఇప్పటిదాకా 1,200 మంది దాకా ఉద్యోగులు చనిపోయారని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్. వెంకటాచలం చెప్పారు. బ్యాంకులు కేసులు, మరణాలకు సంబంధించి సరైన సంఖ్య చెప్పట్లేదని, మరింత ఎక్కువ మంది చనిపోయి ఉంటారని అన్నారు.

కాగా, బ్యాంకు, బీమా సంస్థల ఉద్యోగులకూ కరోనా ముప్పు ఎక్కువగా ఉందని, వారికీ వ్యాక్సిన్ వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి దేవశీష్ పాండా రాష్ట్రాలకు లేఖ రాశారు.

More Telugu News