జూనియ‌ర్ ఎన్టీఆర్ కోలుకోవాల‌ని అభిమానుల ప్ర‌త్యేక పూజ‌లు.. వీడియో వైర‌ల్

17-05-2021 Mon 10:36
  • కొన్ని రోజులుగా ఐసోలేషన్ లో చికిత్స
  • చేతిలో కొబ్బ‌రికాయ ఉంచుకుని, దానిపై క‌ర్ఫూరం వెలిగించి ఫ్యాన్స్ పూజ‌లు
  • తిరుపతిలో ఘ‌ట‌న‌  
ntr fans performs puja

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక‌రిగా రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావ‌డంతో కొన్ని రోజులుగా ఐసోలేషన్ లో వుండి చికిత్స తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సినీ ప్ర‌ముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.  

తాజాగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్ర‌త్యేక పూజలు చేశారు. చేతిలో కొబ్బ‌రికాయ ఉంచుకుని, దానిపై క‌ర్ఫూరం వెలిగించి క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ప‌లువురు అభిమానులు ఎన్టీఆర్ కోసం పూజ‌లు చేసిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

తిరుపతిలో దేవాల‌యంతో పాటు మసీదుకు, చర్చికి వెళ్లి వారు ప్రార్థనలు చేశారు.  కాగా, ఈ నెల 20న జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు వేడుక జ‌ర‌గ‌నుంది. ఆలోగా ఎన్టీఆర్ కోలుకుని మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తార‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్ప‌టికే సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు హీరోలు క‌రోనా బారిన ప‌డి కోలుకున్నారు.