Rakhi Sawant: మాఫియా డాన్ వేధింపుల నుంచి తప్పించుకునేందుకే రితేశ్ ను పెళ్లి చేసుకున్నా: రాఖీ సావంత్

Rakhi Sawant reveals the story behind her marriage with Ritesh
  • ఐటమ్ గాళ్ గా గుర్తింపు తెచ్చుకున్న రాఖీ
  • డాన్ తనను వేధించాడని వెల్లడి
  • పెళ్లి చేసుకోమని బెదిరించేవాడని వివరణ
  • రితేశ్ తో పెళ్లి డాన్ బారి నుంచి తప్పించిందని వ్యాఖ్యలు
పరిచయం అక్కర్లేని ఐటమ్ గాళ్ రాఖీ సావంత్. తన పాటలతోనే కాదు, కామెంట్లతోనూ కలకలం రేపడం రాఖీ స్టయిల్. ఈ బాలీవుడ్ సుందరాంగి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది. తాను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వివరించింది.

కొన్నాళ్ల కిందట రాఖీ హఠాత్తుగా పెళ్లి వార్త తెలిపింది. బ్రిటన్ కు చెందిన రితేశ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడానని వెల్లడించింది. అయితే, నాడు హడావుడిగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. గుజరాత్ కు చెందిన ఓ మాఫియా డాన్ బారి నుంచి తప్పించుకునేందుకే రితేశ్ ను పెళ్లాడానని రాఖీ తెలిపింది.

పరమ కర్కోటకుడైన ఆ డాన్ తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవాడని వివరించింది. మరొకరిని పెళ్లి చేసుకుంటే అతడు తన జోలికి రాకుండా ఉంటాడని రితేశ్ తో జీవితం పంచుకునేందుకు సిద్ధమయ్యానని రాఖీ పేర్కొంది.

"ఆ వ్యక్తితో కలిసి గోవాలో డేటింగ్ కు వెళ్లాను. ఈ సందర్భంగా ఓ భయంకరమైన వీడియో నా కంటపడింది. తన ఫాంహౌస్ లో ఓ వ్యక్తిని అతడు చావగొడుతుండడం ఆ వీడియోలో చూశాను. అప్పట్నించి అతడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, అతడేమో కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకుంటా అని బెదిరించేవాడు. ఆ సమయంలోనే రితేశ్ పరిచయం అయ్యాడు. తనకో మంచి వరుడ్ని చూసిపెట్టమని అతడ్నే అడిగాను. రితేశ్ సరేనన్నాడు. చివరికి రితేశ్ నే పెళ్లి చేసుకున్నాను. ఆ విధంగా మాఫియా డాన్ ముప్పు తొలగిపోయింది" అని రాఖీ వివరించింది.
Rakhi Sawant
Ritesh
Marriage
Don
Gujarath
Bollywood

More Telugu News