మ‌ద్యం తాగ‌లేదు.. మంచినీళ్లు తాగాను: సినీ న‌టి ధన్య

16-05-2021 Sun 12:22
  • 'రాజారాణి' సినిమాలో సీన్‌పై వివ‌ర‌ణ‌
  • తాను ఎక్కువగా పార్టీలు చేసుకోనన్న ధ‌న్య‌
  • వీకెండ్‌ల‌లో త‌న‌ స్నేహితుల్ని కలుస్తాన‌ని వ్యాఖ్య‌
  • లాంగ్‌ డ్రైవ్స్‌ లేదా కాఫీ తాగడానికి  వెళ్తానన్న నటి
i did not drink says dhanya

'సెవంత్‌ సెన్స్‌', 'లవ్‌ ఫెయిల్యూర్‌',  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'రాజారాణి' వంటి సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీ న‌టి ధన్య బాలకృష్ణ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించింది. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెప్పింది. ఈ నేప‌థ్యంలో 'రాజారాణి' సినిమాలో పాత్రని మీ నిజ జీవితంతో సరిపోల్చవచ్చా? అంటూ ఓ అభిమాని అడిగాడు.

దీంతో ఆమె స్పందిస్తూ..  'రాజారాణి' సినిమాలో తాను మందు తాగినట్లు చూపించారని తెలిపింది. అయితే, తాను మందు తాగ‌లేద‌ని, తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని స్ప‌ష్టం చేసింది. తాను ఎక్కువగా పార్టీలు చేసుకోనని, అయితే, వీకెండ్‌ల‌లో త‌న‌ స్నేహితుల్ని కలిసి వాళ్లతో భోజనానికి వెళ్తానని తెలిపింది. అలాగే, లాంగ్‌ డ్రైవ్స్‌ లేదా కాఫీ తాగడానికి  వెళ్తానని చెప్పింది. ఆమె క్రెడిట్‌ కార్డు నంబర్‌, దాని సీవీవీ నంబర్‌ చెప్పాల‌ని ఓ అభిమాని అడ‌గ‌గా అది మీకు ఎందుకు? అంటూ ధ‌న్య జవాబు ఇచ్చింది.