COVID19: టెస్టుల​ నుంచి ఆక్సిజన్​ దాకా.. కరోనా పేషెంట్లపై జీఎస్టీ బాదుడు!

Corona Patients Feel the Brunt of GST On Covid Equipment
  • 15 నుంచి 20% వరకు అదనపు భారం
  • టెస్ట్ కిట్లు, ఆక్సిజన్ పై 12 శాతం జీఎస్టీ
  • శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లపై 18%
  • ఆర్థికంగా చితుకుతున్న కుటుంబాలు
కరోనాతో ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలపై.. జీఎస్టీ కూడా పిడుగులా పడుతోంది. చేతికి వేసుకునే గ్లోవ్స్ నుంచి ఊపిరాడకుంటే అందించే ఆక్సిజన్ వరకు అన్నింటిపైనా జీఎస్టీ భారంతో సతమతమవుతున్నారు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరిన వారికి చికిత్సకయ్యే ఖర్చుతో పాటు.. చికిత్సలో వాడిన పరికరాలు, మందులపై జీఎస్టీ రూపంలోనూ మరింత భారం పడుతోంది.

ఆసుపత్రి బిల్లుపై 15 శాతం 20 శాతం దాకా ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది.  ఆక్సిజన్ పై 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా, చాలా వరకు ఔషధాలపై 12 నుంచి 18 శాతం దాకా ఉంది. కరోనా పరీక్షలు మొదలు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యి వచ్చే దాకా ఓ కరోనా పేషెంట్ అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది.

12% జీఎస్టీ అమలవుతున్న కరోనా పరికరాలు..
  • మెడికల్ ఆక్సిజన్
  • మెకానికల్ విడిభాగాలు, ఫిల్టర్లున్న మాస్కులు
  • చేతికి వేసుకునే రబ్బర్ గ్లోవ్స్
  • కరోనా టెస్ట్ కిట్లు, రీ–ఏజెంట్లు
  • వెంటిలేటర్లు, శ్వాస పరికరాలు
  • రక్షణ కోసం కళ్లకు పెట్టుకునే అద్దాలు
  • బ్యాండేజీలు, శస్త్రచికిత్సకు వాడే పరికరాలు

ఇవీ 18 శాతం జీఎస్టీ అమలవుతున్నవి...

  • శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు, డిసిన్ ఫెక్టెంట్లు, సబ్బులు
  • టిష్యూ పేపర్లు, న్యాప్కిన్లు, వ్యర్థాలు వేసే కవర్లు
  • వస్త్రంతో చేసిన గ్లోవ్స్ , సెల్యులోజ్ ఫైబర్ తో చేసిన మాస్క్ లు, తలకు వాడే నెట్ లు
  • స్టెరిలైజేషన్ కోసం వాడే ఇథైల్ ఆల్కహాల్
  • రోగుల నుంచి ద్రవాలు సేకరించే శానిటరీ వేర్
  • ల్యాబ్ పరికరాలు, థర్మామీటర్లు, సైకోమీటర్లు, హైగ్రోమీటర్లు, క్యాలిబరేటింగ్ మీటర్లు
COVID19
GST
Medical Oxygen
Corona Test

More Telugu News