కరోనాతో కన్నుమూసిన మాజీ మంత్రి నాగిరెడ్డి

16-05-2021 Sun 07:34
  • గత పది రోజులుగా అనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స
  • ఉమ్మడి ఏపీలో పది రోజులపాటు 16 శాఖలకు మంత్రిగా వ్యవహరించి రికార్డు
  • సినీ రంగంపై అభిమానంతో తెలుగుచిత్ర పత్రిక స్థాపన
Ex minister Nagireddy Passed away with corona virus

కరోనా బారినపడి గత పది రోజులుగా అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి గరుడమ్మగారి నాగిరెడ్డి నిన్న కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ధర్మవరం నుంచి మూడుసార్లు టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన నాగిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక శాఖ, రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.

అంతేకాదు, పది రోజులపాటు 16 శాఖలకు మంత్రిగా వ్యవహరించి రికార్డులకెక్కారు. సినిమా రంగంపై అభిమానంతో తెలుగుచిత్ర అనే పత్రికను స్థాపించారు. పలు రచనలు కూడా చేశారు. నాగిరెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2016లో జరిగిన ఓ ప్రమాదంలో కుమారుడు మరణించాడు.