Oxygen: విజయవాడ ఆసుపత్రిలో గడ్డకట్టిపోతున్న ఆక్సిజన్

Oxygen leakage at vijayawada covid hospital
  • ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో గాల్లో కలుస్తున్న ఆక్సిజన్
  • ట్యాంకుల నుంచి నిత్యం లీకవుతున్న ప్రాణవాయువు
  • మంచుకొండలా పేరుకుపోతున్న ఆక్సిజన్
ప్రస్తుత కరోనా కాలంలో ఆక్సిజన్ విలువ ప్రతి ఒక్కరికీ తెలిసివస్తోంది. ప్రాణవాయువు సకాలంలో అందకపోవడంతో కొవిడ్ రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆక్సిజన్‌ను ఎంత జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఆక్సిజన్ లీకై గాల్లో కలిసిపోయింది.

అయినప్పటికీ అధికారులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వీడడం లేదు. అదే ఆసుపత్రిలో ఉన్న మూడు ట్యాంకుల నుంచి నిత్యం ఆక్సిజన్ లీకై గడ్డకట్టి పేరుకుపోతోంది. పేరుకుపోయిన ఆక్సిజన్ మంచుకొండను తలపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూస్తున్న వారు ఆక్సిజన్ లీకేజీని అరికట్టి రోగులకు అందేలా చూడాలని కోరుతున్నారు.
Oxygen
Vijayawada
COVID19
Covid Hospital

More Telugu News