Sri Ranganatha Raju: ప్రశాంతంగా ఉండే జిల్లాలో రఘురాజు ఒక చెద పురుగులా తయారయ్యారు: ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు

Ranganatha Raju comments on Raghu Rama Krishna Raju
  • నియోజకవర్గ ప్రజలను రఘురాజు గాలికొదిలేశారు
  • ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడం లేదు
  • ఆయనపై తాను కూడా కేసు పెట్టానన్న మంత్రి 
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని రఘురాజు గత 14 నెలలుగా గాలికొదిలేశారని... ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ప్రశాంతంగా ఉండే జిల్లాలో ఆయన ఒక చెద పురుగులా తయారయ్యారని అన్నారు. రఘురాజుపై తాను కూడా కేసు పెట్టానని తెలిపారు. ప్రజల మనోభావాలను ఆయన అర్థం చేసుకోవడం లేదని దుయ్యబట్టారు. రఘురాజు అరెస్ట్ అలాంటి వ్యక్తులందరికీ ఒక గుణపాఠం కావాలని అన్నారు. 
Sri Ranganatha Raju
Raghu Rama Krishna Raju
YSRCP

More Telugu News