Varla Ramaiah: జగన్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ వేయడం వల్లే రఘురాజును అరెస్ట్ చేశారు: వర్ల రామయ్య

Reason behind Raghu Rama Krishna Rajus arrest is this says Varla Ramaiah
  • రఘురాజుపై జగన్ కక్ష కట్టారు
  • దేశ వ్యాప్తంగా జగన్ అభాసుపాలయ్యారు
  • ముద్దాయిల పట్ల న్యాయ వ్యవస్థ వ్యత్యాసం చూపకూడదు
ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఎం జగన్ కక్ష కట్టారని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం వల్లే రఘురాజును అరెస్ట్ చేశారని అన్నారు. రఘురాజు పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు అంగీకరించిందని... దీంతో, దేశ వ్యాప్తంగా జగన్ అభాసుపాలయ్యారని చెప్పారు. ముద్దాయిల స్థాయిని న్యాయ వ్యవస్థ పట్టించుకోకూడదని... విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల పట్ల వ్యత్యాసం చూపకూడదని అన్నారు. కక్ష పూరిత చర్యలను జగన్ మానుకోవాలని సూచించారు.
Varla Ramaiah
Telugudesam
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP

More Telugu News