Bandi Sanjay: రోగుల్ని అడ్డుకున్న మీరు ఏపీ పోలీసుల్ని ఎలా రానిచ్చారు?: బండి సంజయ్

Bandi Sanjay Slaps KCR Over MP Raghurama Arrest
  • ఎంపీ రఘురామ అరెస్ట్‌ను ఖండించిన బండి సంజయ్
  • మిత్రుడు జగన్ కోసం కేసీఆర్ నిబంధనలు తుంగలో తొక్కారు
  • లోక్‌సభ స్పీకర్ అనుమతి లేకుండా ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు?
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఏపీ నుంచి అంబులెన్సుల్లో హైదరాబాద్ వస్తున్న రోగులను సరిహద్దుల వద్ద అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు.. ఏపీ పోలీసులను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. రఘురామ అరెస్టు దారుణమని అన్నారు.

రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రుడు జగన్ కోసం కేసీఆర్ నిబంధనలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. లోక్‌సభ స్పీకర్ అనుమతి లేకుండా రఘురామను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందన్నారు. ఓ ఎంపీని  ఈడ్చుకెళ్లి కారులో తోయడమేంటని బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Bandi Sanjay
Raghu Rama Krishna Raju
BJP
Jagan
KCR

More Telugu News