Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో ఫిర్యాదు

Another complaint against TDP chief Chandrababu
  • ఎన్440కే వైరస్ పేరు చెప్పి జనాన్ని భయపెడుతున్నారని ఫిర్యాదు
  • మైలవరం పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ఫిర్యాదు
  • ఇలాంటి కారణంతో ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఏపీలో వెలుగుచూసిన ఎన్440కే రకం కరోనా వైరస్ ప్రమాదకరమైనదని చెబుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబుపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తాజాగా,  ఇదే కారణంతో కృష్ణా జిల్లా మైలవరం న్యాయవాదులు ఓర్సు శ్రీనివాసరావు, పజ్జూరు సాంబశివరావు నిన్న స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్440కే పేరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ ఫిర్యాదుపై కేసు నమోదైనదీ, లేనిదీ తెలియరాలేదు.
Chandrababu
N440k
police case
TDP

More Telugu News