Cricket: డబ్ల్యూటీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ కంటే న్యూజిలాండ్‌కే విజయావకాశాలు ఎక్కువ: సంజయ్ మంజ్రేకర్‌

NewZealand have higher winning chances in Southampton Says Manjrekar
  • జూన్‌ 18-22 మధ్య జరగనున్న టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌
  • సౌతాంఫ్టన్‌లో పరిస్థితులు న్యూజిలాండ్‌కే అనుకూలం
  • పిచ్‌లు కివీస్‌ బౌలర్లకే అనుకూలం
  • భారత్‌లో జరిగి ఉంటే టీమిండియా ఘన విజయం
  • మాజీ క్రికెటర్‌ సంజయ్ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సౌతాంఫ్టన్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య డబ్ల్యూటీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ జూన్‌ 18-22 మధ్య జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌పై భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవడానికి కాస్త అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సౌతాంఫ్టన్‌లో ఉన్న పరిస్థితులు న్యూజిలాండ్‌కు కాస్త అనుకూలంగా ఉంటాయని తెలిపారు.

అక్కడి వాతావరణ పరిస్థితులు, పిచ్‌ల తీరును బట్టి చూస్తే న్యూజిలాండ్‌కు విజయావకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత ఆటగాళ్లతో పోలిస్తే న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఆ వాతావరణంలో కాస్త మెరుగ్గా రాణించే అవకాశం ఉందని తెలిపారు. భారత జట్టు బౌలింగ్‌ టీం బలంగా ఉందన్నారు. అయినప్పటికీ అక్కడి పిచ్‌లు కివీస్‌ ప్లేయర్లకే అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. అదే ఈ మ్యాచ్‌ భారత్‌లో జరిగి ఉంటే టీమిండియా మూడు రోజుల్లోనే విజయం సాధించేదని అభిప్రాయపడ్డారు.
Cricket
WTC
ICC
Team New Zealand
Team India

More Telugu News