Ayyanna Patrudu: జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం బెయిల్ నిబంధనల ఉల్లంఘన కాదా?: అయ్యన్న

Ayyanna Patrudu questions Raghurama Krishna Raju arrest
  • హైదరాబాదులో ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్
  • విజయవాడ తరలిస్తున్న ఏపీ సీఐడీ అధికారులు
  • అరెస్టులన్నీ శుక్రవారమే జరుగుతాయన్న అయ్యన్న
  • కోర్టులకు శని, ఆదివారాలు సెలవులని వెల్లడి
  • బెయిల్ రాకుండా చేసేందుకేనని వ్యాఖ్యలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఈ సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రఘురామను సీఐడీ అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో స్పందించారు. ప్రాణాలు పోతున్న రోగులను తెలంగాణ సరిహద్దుల వద్ద ఆపుతున్నారు కానీ, ఏపీ సీఐడీ పోలీసులను మాత్రం ఆపడంలేదు... ఆ రహస్యం ఏమిటో? అని సందేహం వ్యక్తం చేశారు.

"వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన వారి అరెస్టులన్నీ శుక్రవారమే జరుగుతాయి. కూల్చివేతల ముహూర్తం శనివారం తెల్లవారుజామునే ఉంటుంది. కోర్టులకు శని, ఆదివారాలు సెలవు కాబట్టి బెయిళ్లు, స్టేలు రాకుండా ఉండేందుకు ఆ రోజులను ఎంచుకుంటున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయించడం బెయిల్ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదా?" అని అయ్యన్న వ్యాఖ్యానించారు.
Ayyanna Patrudu
Raghu Rama Krishna Raju
Jagan
Bail
YSRCP
Andhra Pradesh

More Telugu News