Chiranjeevi: చిరూ సినిమాపై అది పుకారేనట!

Just a rumour on Chiru movie
  • మలయాళంలో ప్రశంసలు అందుకున్న 'లూసిఫర్'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు
  •  మోహన్ రాజాకి దర్శకత్వ బాధ్యతలు
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు  
మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో చేసిన 'లూసిఫర్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. నటన పరంగా మోహన్ లాల్ ను ఈ సినిమా మరో మెట్టుపై నిలబెట్టింది. ఆ సినిమా తెలుగు రీమేకులో చేయాలనే ఉత్సాహంతో చిరంజీవి ఉన్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజాకు దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే మోహన్ రాజా చేసిన మార్పుల పట్ల చిరంజీవి సంతృప్తి చెందలేదనీ, దాంతో ఈ ప్రాజెక్టు నుంచి మోహన్ రాజా తప్పుకున్నాడనే టాక్ బయల్దేరింది. అయితే ఇందులో వాస్తవం లేదట .. ఇదంతా పుకారేనని అంటున్నారు. మోహన్ రాజా చేసిన మార్పుల పట్ల చిరంజీవి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారట. కరోనా కాలం తరువాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాను అనుకున్న నటీనటుల .. సాంకేతిక నిపుణుల లిస్టును కూడా చిరంజీవికి మోహన్ రాజా అందజేయనున్నాడట.
Chiranjeevi
Mohan Raja
Lucifer Movie

More Telugu News