తడిసిముద్దయిన హైదరాబాద్... పలు ప్రాంతాల్లో వర్షం
- అధిక వేడిమి నుంచి నగరజీవికి ఉపశమనం
- ఓ మోస్తరు గాలులతో వర్షం
- నేడు, రేపు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ
- గాలుల్లో అస్థిరతే కారణమని వెల్లడి
మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా తమిళనాడులోని పలు ప్రాంతాల మీదుగా గాలుల్లో అస్థిరత వల్ల నేడు, రేపు కూడా తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న కూడా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.