Ajith: సీఎం స్టాలిన్ కు విరాళం అందించిన అజిత్

Actor Ajith donates RS 25 Lakhs to CM relief fund
  • తమిళనాడులో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
  • బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్న సినీ ప్రముఖులు
  • రూ. 25 లక్షల విరాళం అందించిన అజిత్
కరోనా బాధితుల సహాయార్థం తమిళ సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా భారీ విరాళాలను అందిస్తున్నారు. తాజాగా హీరో అజిత్ రూ. 25 లక్షల విరాళం ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు విరాళాన్ని అందజేశారు. తమిళనాడులో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కూడా ఈరోజు స్టాలిన్ ను కలిసి రూ. 25 లక్షల విరాళం అందించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. కరోనాను కట్టడి చేసేందుకు స్టాలిన్ ప్రభుత్వం లాక్ డౌన్ కూడా విధించింది.
Ajith
Tamil Nadu
Kollywood
Stalin
Corona Virus
Donation

More Telugu News