Corona Virus: కరోనా రోగులకు చికిత్స చేసేందుకు అనుమతించండి: ఢిల్లీ కోర్టులో ఉగ్రవాది పిటిషన్

Terrorist requests Delhi HC to allow him to give treatment to Corona patients
  • తీహార్ జైల్లో ఉన్న ఆల్ ఖైదా ఉగ్రవాది అహ్మద్
  • వైద్యుడిగా ఏడేళ్ల అనుభవం ఉందని కోర్టుకు చెప్పిన అహ్మద్
  • ఫిబ్రవరి 22న అహ్మద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
కరోనా రోగులకు సేవ చేసేందుకు ఉగ్రవాదులు కూడా ముందుకొస్తున్న విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రోగులకు చికిత్స అందించేందుకు తనను అనుమతించాలని ఆల్ ఖైదా ఉగ్రవాది డాక్టర్ సబీల్ అహ్మద్ ఢిల్లీ కోర్టును కోరారు. వైద్యుడిగా తనకు ఏడేళ్ల అనుభవం ఉందని... అందువల్ల తీహార్ జైల్లో ఉన్న కరోనా సోకిన ఖైదీలకు చికిత్స అందించేందుకు తనకు అనుమతిని ఇవ్వాలని కోర్టుకు ఆయన విన్నవించారు. తాను ఎంబీబీఎస్ చదివానని... క్లిష్టమైన కేసుల చికిత్సలో తనకు అనుభవం ఉందని చెప్పారు. మరోవైపు, అహ్మద్ ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఫిబ్రవరి 22న అరెస్ట్ చేశారు.
Corona Virus
Treatment
Terrorist
Tihar Jail

More Telugu News