Balakrishna: బాలయ్య అంటే భయపడిపోయిందట!

Pragya Jaiswal appreciates the coolness of Balakrishna
  • షూటింగు దశలో 'అఖండ'
  • బాలయ్యకు కోపం ఎక్కువ అనుకున్నాను
  • ఆయన చాలా కూల్
  • నెక్స్ట్ షెడ్యూల్  కోసం వెయిట్ చేస్తున్నానన్న ప్రగ్య  
ప్రగ్యా జైస్వాల్ .. అందానికి కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తుంది. తెలుగులో ఈ సుందరి చేసింది 10 సినిమాల లోపే. వాటిలో 'కంచె' సినిమా మాత్రమే ఆమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ తరువాత సినిమాలు ఆ క్రేజ్ ను పెంచడంలో దాదాపు విఫలమయ్యాయి. అందువల్లనే అమ్మడు ఇంకా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోతోంది. 'ఆచారి అమెరికా యాత్ర' ఫ్లాప్ కావడంతో, ఆ తరువాత ఈ అమ్మాయికి గ్యాప్ వచ్చేసింది. మళ్లీ ఇప్పుడు ఆమె బాలకృష్ణ సరసన నాయికగా 'అఖండ' సినిమా చేస్తోంది.

తాజా ఇంటర్వ్యూలో ప్రగ్య ఈ సినిమా గురించిన విషయాలను ప్రస్తావించింది. 'ఈ సినిమాలో బాలకృష్ణగారి సరసన చేయవలసి ఉంటుందనే సరికి నేను భయపడ్డాను. ఆయనకి చాలా కోపం ఎక్కువనీ .. ఆయన ఉన్నంత సేపు సెట్లో సైలెంట్ గా ఉండాలని నాకు చాలామంది చెప్పారు. దాంతో ఆయనతో కలిసి నటించాలనేసరికి నేను చాలా భయపడిపోయాను. కానీ సెట్లో బాలకృష్ణ గారు సరదాగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కూల్ గా ఉండటంతో నాకు కాస్త ధైర్యం వచ్చింది. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందా? అని నేను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.
Balakrishna
Pagya Jaiswal
Poorna

More Telugu News