రాష్ట్రాలు కొట్టుకునే దారుణ పరిస్థితులు తలెత్తాయి: కేజ్రీవాల్

13-05-2021 Thu 18:00
  • ఇన్నాళ్లు ఆక్సిజన్ కొరతతో బాధపడ్డాం
  • ఇప్పుడు వ్యాక్సిన్ కొరత తీవ్రతరమైంది
  • వ్యాక్సిన్ కోసం కేంద్రాన్ని అడుక్కోవాల్సి వస్తోంది
Stares are quarelling says Kejriwal

దేశ వ్యాప్తంగా నెలకొన్న కరోనా వ్యాక్సిన్ కొరతపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... ఇన్నాళ్లు ఆక్సిజన్ కొరతతో బాధపడితే, ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత తీవ్రతరమయిందని ఆయన అన్నారు. మన రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడటమో, కొట్టుకోవడమో జరుగుతోందని చెప్పారు.

ఢిల్లీతో మహారాష్ట్ర, ఒరిస్సాతో కర్ణాటక ఇలా రాష్ట్రాలు కలహించుకునే దారుణ పరిస్థితులు తలెత్తాయని అన్నారు. నిన్న మొన్నటి వరకు ఆక్సిజన్ కోసం కేంద్రాన్ని అడుక్కోవాల్సి వచ్చిందని... ఇప్పుడు వ్యాక్సిన్ కోసం అడుక్కోవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు.