సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రజనీకాంత్

13-05-2021 Thu 17:09
  • నిన్ననే హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లిన రజనీ
  • హారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికిన ఆయన భార్య
  • ఇంట్లోనే సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న రజనీ
Rajinikanth takes second dose Corona vaccine

ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కరోనా వ్యాక్సిన్ రెండో డోసును తీసుకున్నారు. తన ఇంటిలోనే అయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా రజనీ పక్కన ఆయన కుమార్తె సౌందర్య ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. తన తాజా చిత్రం 'అన్నాత్తే' షూటింగ్ ను ముగించుకుని హైదరాబాద్ నుంచి నిన్ననే ఆయన చెన్నైకి చేరుకున్నారు.

ఇంటికి వచ్చిన ఆయనకు భార్య హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, కరోనా నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సిన్ వేయించుకోవడమే బెటర్ అని నిపుణులు చెపుతున్న సంగతి తెలిసిందే. దీంతో, సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.