మన హీరోల్లో ఆయనకైతే వంద ముద్దులు పెడతా: సురేఖావాణి

13-05-2021 Thu 15:28
  • చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం
  • ముద్దులు పవన్ కల్యాణ్ కు పెడతా
  • నా కూతురు యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటోంది
I give kisses to Pawan Kalyan says Surekha Vani

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖావాణికి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇటీవలి కాలంలో ఆమె కొంత నెమ్మదించినా... అభిమానుల్లో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు వైరల్ అవుతుంటాయి. సినిమాలు కొంత తగ్గినా... సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటూ, అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న సురేఖ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

చిరంజీవికి తాను పెద్ద అభిమానినని... ఆయనను చూసిన ప్రతిసారి తన కళ్లలో నీళ్లొస్తాయని సురేఖ చెప్పింది. స్టాలిన్ షూటింగ్ సమయంలో ఆయనను చూసి ఏడుస్తుంటే ఓదార్చారని... అంతేకాదు, ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారని తెలిపింది.

ఇక మన హీరోల్లో ముద్దు పెట్టాల్సి వస్తే ఎవరికి పెడతారనే ప్రశ్నకు సమాధానంగా... పవన్ కల్యాణ్ కు అయితే వంద ముద్దులైనా పెడతానని చెప్పింది. తన కూతురు సుప్రియకు నటన పట్ల ఆసక్తి ఉందని... ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటోందని తెలిపింది. తన భర్త చనిపోయిన తర్వాత అత్తింటి వేధింపులు తట్టుకోలేక బయటకొచ్చేశానని చెప్పింది.