సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

13-05-2021 Thu 07:36
  • త్వరలో సమంత వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ 
  • మరో సినిమాకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్
  • హిందీ సినిమా కోసం లడఖ్ కు నాగ చైతన్య
Samanthas web series to be streamed soon

*  కథానాయిక సమంత ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సీరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం, వహించిన ఈ సీరీస్ ను జూన్ 11 నుంచి దేశంలోని వివిధ భాషల్లో స్ట్రీమింగ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సమంత ఇందులో నెగటివ్ టచ్ తో కూడిన పాత్రను పోషించింది.
*  ప్రస్తుతం 'ఎఫ్ 3', 'గని' సినిమాలలో నటిస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో మరో చిత్రాన్ని కమిట్ అవుతున్నాడు. చలో, భీష్మ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో వరుణ్ ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.   
*  అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'లాల్ చంద్ చద్దా' హిందీ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ కోసం చైతు లడఖ్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా దీనిని నిర్మిస్తున్నారు.