రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు టీటీడీ ఊరట

13-05-2021 Thu 07:11
  • ఏప్రిల్ 21- మే 31 మధ్య టికెట్లు బుక్ చేసుకున్న వారికి మరో ఛాన్స్ 
  • ఏడాదిలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చన్న టీటీడీ
  • ప్రస్తుత కరోనా నేపథ్యంలో నిర్ణయం
 devotees who have booked Rs 300 special darshan tickets can change dates

తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు టీటీడీ ఊరట కల్పించే ప్రకటన చేసింది. ఏప్రిల్ 21-మే 31 మధ్య ఆన్‌లైన్ ద్వారా రూ. 300 టికెట్లు బుక్ చేసుకున్న వారికి తేదీలు మార్చుకునే అవకాశం కల్పించింది.

ఏడాదిలోపు ఎప్పుడైనా వీరు స్వామి వారిని దర్శించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో భక్తులు తిరుమలకు రాలేని పరిస్థితి ఉందని, అందుకే ఈ వెసులుబాటు కల్పించినట్టు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.