వరుణ్ తేజ్ కొత్త ప్రాజెక్టుకు దసరానే ముహూర్తం!

11-05-2021 Tue 10:37
  • 'ఛలో'తో సూపర్ హిట్
  • 'భీష్మ'తో బ్లాక్ బస్టర్
  • మూడో సినిమా వరుణ్ తో
  • మళ్లీ రష్మికకు ఛాన్స్
Varun Tej new project starts at Dasara

ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడిగా వెంకీ కుడుముల మంచి మార్కులు కొట్టేశాడు. ఆయన నుంచి వచ్చిన 'ఛలో' .. 'భీష్మ' భారీ విజయాలను అందుకున్నాయి. ఆ తరువాత కూడా ఆయన మరో ప్రేమకథనే రెడీ చేసుకున్నాడు. ఈ కథను ఆయన వరుణ్ తేజ్ కి వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి.

అయితే ముందుగా అనుకున్న ప్రకారం 'గని' సెట్స్ పైకి వెళ్లకపోవడం, 'ఎఫ్ 3' షూటింగుకు కూడా కరోనా కారణంగా అంతరాయం ఏర్పడటం ఈ ప్రాజెక్టుపై ప్రభావం చూపింది. ముందుగా వరుణ్ తేజ్ 'గని' .. 'ఎఫ్ 3' సినిమాలను పూర్తి చేయనున్నాడు.

ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ - వెంకీ కుడుముల కాంబినేషన్లోని సినిమా ఎప్పుడు మొదలుకావొచ్చనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఈ సినిమా షూటింగును దసరాకి మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందనీ, తనకి హ్యాట్రిక్ హిట్ తెస్తుందని వెంకీ కుడుముల భావిస్తున్నాడట.

ఇక తొలి రెండు సినిమాల్లో రష్మికను కథానాయికగా తీసుకున్న ఆయన, సెంటిమెంట్ ప్రకారం మళ్లీ ఆమెనే ఎంపిక చేయనున్నాడనే టాక్ ఒకటి వినిపిస్తోంది. ఆల్రెడీ రెండు హిట్స్ ఇచ్చాడు గనుక, రష్మిక కూడా కాదనే అవకాశం లేదనే చెప్పుకోవాలి.