టీఎన్నార్ మరణం కలచివేసింది... నా సినిమాలో వేషం కూడా వేశాడు: మోహన్ బాబు

10-05-2021 Mon 22:07
  • సినీ జర్నలిస్ట్ టీఎన్నార్ కరోనాతో మృతి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోహన్ బాబు
  • గతంలో తనను ఇంటర్వ్యూ చేశాడని వెల్లడి
  • సినిమా చాన్స్ ఇస్తానని మాటిచ్చినట్టు వివరణ
  • సన్ ఆఫ్ ఇండియాలో వేషం వేశారని వ్యాఖ్యలు
Mohan Babu condolences for TNR death

ప్రముఖ సినీ పాత్రికేయుడు, నటుడు టీఎన్నార్ (తుమ్మల నరసింహారెడ్డి) కరోనాతో మరణించడం పట్ల టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టీఎన్నార్ మృతి తనను కలచివేసిందని తెలిపారు. టీఎన్నార్ గతంలో తన చానల్ కోసం తనను ఇంటర్వ్యూ చేశాడని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. చాలా మంచి వ్యక్తి అని, మంచి నటుడు కూడా అని కొనియాడారు.

ఇంటర్వ్యూ చేసిన సమయంలోనే అతనికి చెప్పానని, తన సినిమాలో తప్పకుండా వేషం ఇస్తానని మాటిచ్చానని వెల్లడించారు. చెప్పినట్టుగానే, తన సన్ ఆఫ్ ఇండియా చిత్రంలో టీఎన్ఆర్ కు వేషం ఇచ్చామని, ఇప్పుడాయన మన మధ్య లేకపోవడం బాధాకరం అని మోహన్ బాబు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి, ఆయన కుటుంబానికి మనశ్శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.