Corona Virus: డబుల్ మ్యూటెంట్‌కు వ్యాక్సిన్‌ నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉన్నట్లు ఆధారాలు లేవు: డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన శాస్త్రవేత్త

No proof to say double mutant is escaping from vaccines
  • భారత్‌ రకానికి వేగంగా వ్యాపించే గుణం
  • బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా రకాల కలయికే డబుల్‌ మ్యూటెంట్‌
  • భారత్‌లో పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన
  • ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సౌమ్య స్వామినాథన్‌
కరోనా రెండో దశలో భాగంగా భారత్‌లో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ రకానికి వేగంగా, అత్యధికంగా వ్యాపించే గుణం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఉద్ఘాటించారు. దేశ ప్రజలంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సీఎన్‌బీసీ-టీవీ18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత్‌లో ఉన్న డబుల్‌ మ్యూటెంట్‌లో బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా వైరస్‌ రకాలు రెండూ ఉన్నాయని సౌమ్య తెలిపారు. దేశంలో వైరస్‌ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదకరమైన వైరస్‌ రకాలు పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. భారత్‌లో నమోదవుతున్న కొత్త కేసులు, మరణాలపై డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన చెందుతోందని తెలిపారు.

ఇక వ్యాక్సిన్ల సమర్థతపై మాట్లాడుతూ.. ఇప్పటి వరకు భారత్‌లో వెలుగులోకి వచ్చిన డబుల్‌ మ్యూటెంట్‌.. వ్యాక్సిన్ల సామర్థ్యం నుంచి తప్పించుకుంటోందనడానికి ఆధారాలు లేవని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొవిడ్‌ తీవ్రతను తగ్గిస్తాయని.. ఐసీయూలో చేరాల్సిన స్థితి నుంచి కచ్చితంగా రక్షిస్తాయని వెల్లడించారు. ఏ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా.. దాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Corona Virus
double mutant
Soumya Swaminathan
indian variant

More Telugu News