Piyush Chawla: క్రికెటర్ పియూష్ చావ్లా కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన కరోనా

Cricketer Piyush Chawla father Pramod Kumar dies of post covid issues
  • కరోనాతో పియూష్ తండ్రి ప్రమోద్ కుమార్ మృతి
  • కరోనా నుంచి కోలుకున్నా వదలని అనారోగ్య సమస్యలు
  • తన తండ్రి ఈ ఉదయం చనిపోయాడన్న పియూష్
  • జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని తీవ్ర ఆవేదన
కరోనా మహమ్మారి కారణంగా భారత క్రికెటర్ పియూష్ చావ్లా కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. పియూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా కరోనాతో మృతి చెందారు. ప్రమోద్ కుమార్ కరోనా నుంచి కోలుకున్నప్పటికీ, తదనంతర సమస్యలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని పియూష్ చావ్లా స్వయంగా వెల్లడించాడు.

తాము ఎంతగానో ప్రేమించే వ్యక్తి దూరమయ్యాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని, తన బలం తన తండ్రేనని, కానీ ఇవాళ ఆయన్ను కోల్పోయానని పియూష్ చావ్లా తీవ్ర విచారం వెలిబుచ్చాడు.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో మృత్యుఘంటికలు మోగిస్తోంది. మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి కుటుంబంలో కొవిడ్ పెను విషాదం నింపడం తెలిసిందే. వేదా తల్లి, సోదరి కొన్నివారాల వ్యవధిలో కరోనాకు బలయ్యారు.
Piyush Chawla
Pramod Kumar Chawla
Death
Covid
India

More Telugu News